నారద వర్తమాన సమాచారం
2.50 లక్షల టన్నుల ఇసుక నిల్వ చేయండి.. జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
నరసరావు పేట,
వర్షాకాలంలో ఇసుక తవ్వకాలు నిలిచిపోనున్న కారణంగా జూన్ 01 నాటికి జిల్లాలో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను స్టాక్ పాయింట్లలో నిల్వ చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. ఇసుక నిల్వ చేసేందుకు స్టాక్ పాయింట్లను గుర్తించాలన్నారు. అన్ని స్టాక్ పాయింట్లలో ఇసుక నిర్వహణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.
స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు.
ఇసుక రీచుల్లో ఇసుక తవ్వకాల కోసం ఏజెన్సీల నియామకం ప్రక్రియ ప్రారంభించాలన్నారు. ముందుగా దిడుగు -1 రీచులో ప్రయోగాత్మకంగా నామినేషన్ విధానంలో ఏజెన్సీని నియమించాలన్నారు. నామినేషన్ విధానం ఫలితాన్ని బట్టి మిగిలిన రీచుల్లో ఏజెన్సీల నియామకంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
జిల్లాలోని 5 ఇసుక రీచులలో అక్టోబరు వరకూ తవ్వకాలు చేపట్టేందుకు పర్యావరణ శాఖ నుంచి అనుమతి లభించిందన్నారు. దీంతో 3.10 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకానికి అందుబాటులోకి వస్తుందన్నారు.
అంబడి పూడి – 1,2,3 రీచులు, కోనూరు -1 రీచుల్లో అక్టోబరు 22 వరకూ.. దిగుడు -1 రీచులో డిసెంబరు 30 వరకూ ఇసుక తవ్వకాలకు అనుమతి లభించిందన్నారు. సదరు రీచుల పర్యవేక్షణకు ఇంచార్జులను నియమించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మైన్స్ & జియాలజీ అధికారి నాగిని, ఆర్డీవో రమణా కాంత్ రెడ్డి, జిల్లా రవాణా అధికారి సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.