నారద వర్తమాన సమాచారం
ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు సందర్శించిన వరల్డ్ బ్యాంకు బృందం
తేది : 24-04-2025
పల్నాడు జిల్లా క్రోసూరు సబ్ డివిజన్లో అమరావతి మండలం లో లేమల్లె గ్రామంకి ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం కల్వకొండ విజయ శేఖర్ సీనియర్ ఆపరేషనల్ ఆఫీసర్ , ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ , హేమేంద్ర మైనర్ ఐ.ఎఫ్. సి. అడ్వైసర్ , కృష్ణయ్య, యువరాజ్ అహుజ ఐ ఎఫ్ సి మెహతా సింగ్, తాన్య, శేఖర్ మెహతా, హేమచంద్ర, నవనీత్ రాయ్ ,ఇషా సార్, ఐ ఎఫ్ సి, ఆపరేషన్స్ ఆఫీసర్, డాక్టర్ సితాల్ సోమని, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ అమలకుమారి, రైతు సాధికార సంస్థల నుంచి ఎన్నార్వో తిమిటిక్ లీడ్ శ్రీనివాసరావు, గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న క్రోసూరు పద్మావతి 25 రకాల విత్తనాలతో వేసిన రబీ డ్రైసోయింగ్ మోడల్ సందర్శించడం జరిగింది. రబీ ట్రై సోయింగ్ మోడల్ లో అన్ని రకాల పంటలను ప్రతినిధుల బృందం సూక్ష్మంగా పరిశీలించడం జరిగింది. ఈ మోడల్ లో ఇప్పటివరకు ఎంత ఆదాయం వచ్చింది ఎంత ఖర్చు అయినా అయిందని తెలుసుకోవడం జరిగింది. ప్రధాన పంటలో పత్తిలో ఎంత దిగుబడి వచ్చింది ఎంత ఖర్చు అయిందని అడిగి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రబీ డ్రై సోయింగ్ మోడల్ వేసుకోవడం ద్వారా వేసవిలో పశువులకు పశుగ్రాసంగా ఉపయోగపడుతుందని తెలియజేశారు. మరియు రైతులకు అదనపు ఆదాయం గా పంట తీసుకోవచ్చని తెలియజేశారు.
ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం మాట్లాడుతూ క్రోసూరు పద్మావతి గారి రబీ ట్రై సోయింగ్ మోడల్ ఎంతో బాగుందని ఇప్పుడున్న వేసవి పరిస్థితుల్లో ఎక్కడ కూడా పంట కనపడట్లేదు ఒక్క ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో మాత్రమే ఈ విధంగా ఈ మోడల్స్ అభివృద్ధి అవ్వటం చాలా మంచి వాతావరణం అని తెలియజేశారు. ముఖ్యంగా రైతు సోదరులందరూ కూడా డ్రై సోయింగ్ & పిఎండిఎస్ మోడల్స్ వేసుకోవడం ద్వారా రైతులకు వేసవిలో కూడా ఆదాయం తీసుకోవచ్చని తెలియజేశారు. భూమిని వేడి వాతావరణం నుంచి రక్షించుకోవచ్చు అని తెలియజేశారు.
అనంతరం అత్తలూరు గ్రామంలో అత్తలూరు వారి పాలెం ఆర్గానిక్ సొసైటీని సందర్శించడం జరిగింది. ఆర్గానిక్ సొసైటీ వారి గోశాల సందర్శించడం జరిగింది. గోశాలలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు పరిశీలించడం జరిగింది మరియు ప్రకృతి వ్యవసాయ రైతులకు కావాల్సిన ఇన్పుట్స్ తయారీ గురించి తెలుసుకోవడం జరిగింది. అనంతరం ఆర్గానిక్ సొసైటీ లోని ఆహార పదార్థాల ప్రాసెసింగ్ యూనిట్ ని పరిశీలించడం జరిగింది. అనంతరం అనంతరం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో మాట్లాడుతూ వారి అనుభవాలు తెలుసుకోవడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మహిళా సంఘ సభ్యులతో మాట్లాడటం జరిగింది. సంఘం ద్వారా ప్రకృతి వ్యవసాయం జరిగే కార్యక్రమాలన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగింది. అనంతరం ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో మాట్లాడటం జరిగింది. సిబ్బంది వారీగా వారి యొక్క విధులు బాధ్యతలు గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అమల కుమారి మాట్లాడుతూ ముఖ్యంగా రైతు సోదరులందరూ కూడా ఈ సమయంలో పంట పొలాలని ఖాళీగా ఉంచకుండా 30 రకాల విత్తనాలతో 20 కేజీల పీఎండీఎస్ విత్తనాలు వేసుకోవడం ద్వారా భూమి సారవంతం అవుతుందని తెలియజేశారు.
భూతాపం తగ్గించుకోవచ్చు అని, రైతులకు పిఎండిఎస్ వేసుకోవడం ద్వారా పశుగ్రాసంగా తీసుకోవచ్చని మరియు అదన ఆదాయంగా కూడా తీసుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అత్తలూరు వారి పాలెం ఆర్గానిక్ సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ నూతలపాటి సురేంద్రబాబు, ఆదినారాయణ, త్రివేది, అమరావతి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అహ్మద్, హార్టికల్చర్ ఆఫీసర్ అశోక్ రెడ్డి, హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీ నిత్య , గ్రామ వ్యవసాయ సహాయకులు అర్చన, జిల్లా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది నందకుమార్, మాస్టర్ ట్రైనర్ మధుబాబు, ఇంచార్జ్ రాజు, మొదలగు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.