నారద వర్తమాన సమాచారం
నరసరావుపేట రూరల్ పరిది జగనన్న కాలనీలో కార్డన్ & సెర్చ్. నిర్వహించిన వన్ టౌన్ పోలీసులు
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్
నరసరావుపేట:-
ది.03.05.2025 వ తేదీ రాత్రి నరసరావుపేట రూరల్ సిఐ ఆధ్వర్యంలో జగనన్న కాలనీ నందు కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు.
పల్నాడు జిల్లా నందు శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా,సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురిచేసే వారిని గుర్తించే దిశగా ప్రజలకు మేమున్నాము అనే భరోసా ఇచ్చేందుకు ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐ.పి.ఎస్., ఆదేశాల మేరకు నరసరావుపేట రూరల్ సీఐ పి.రామకృష్ణ, నరసరావుపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ ఎమ్ వి చరణ్, ట్రాఫిక్ సిఐ
సిహెచ్.లోకనాథం ఇన్స్పెక్టర్
వారి సిబ్బందితో నరసరావుపేట రూరల్ పోలీసు స్టేషన్ పరిది లోని జగనన్న కాలనీ, పరిసర ప్రాంతాలలో శనివారం రాత్రి కార్దన్ & సెర్చ్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా నరసరావుపేట రూరల్ స్టేషన్ సిఐ
పి.రామకృష్ణ మాట్లాడుతూ…. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు…
అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని గుర్తించబడిన పరిసర ప్రాంతాలలో అణువణువు, క్షుణ్ణంగా సోదాలు చేయడం జరుగుతుందని, గంజాయి, ఇతర మత్తు పధార్ధాల విక్రయాలు మరియు వినియోగంపై, అనుమానం ఉన్న వ్యక్తులపై ఆరా తీయడం జరిగిందని,
శాంతిభద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తులపై పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని,
రాత్రి సమయాలలో చిన్న చిన్న సంఘటనలు పెద్ద సంఘటనలుగా ప్రజల్లో వ్యాప్తి చెందుతుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి ప్రతి రోజూ అన్నీ ముఖ్య ప్రదేశాలలో కార్దన్ & సెర్చ్, ఆకస్మిక తనిఖీలు, వాహన తనిఖీలు, డ్రంక్ & డ్రైవ్ కార్యక్రమాలు నిరంతరం నిర్వహించడం జరుగుతుంది అని తెలియజేశారు.
జిల్లా వ్యాప్తంగా ఇటువంటి ఘర్షణలకు ఆస్కారం లేకుండా, అసత్య ప్రచారాలు నియంత్రించేలా పోలీసులు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఇకనుంచి తరచుగా కార్డన్ & సెర్చ్ నిర్వహించడంతో పాటు అన్ని ప్రాంతాల్లో తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుంది.
నేరాలు, ఘర్షణలు నియంత్రణకు పూర్తిస్థాయిలో అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








