నారద వర్తమాన సమాచారం
🍀🌻🍀🌻🍀🌻🍀🌻🍀
శ్రీ వారాహి దేవి నవరాత్రులు
మరియు పూజా విధానము …
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
ఆషాఢమాసంలో శ్రీ వారాహి నవరాత్రి మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి.
వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని..లలిత యొక్క రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి…అందుకే ఆవిడను దండనాథ అంటారు…
అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్ట భుజాలతో, శంఖ, చక్ర, హల(నాగలి), ముసల(రోకలి), పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది…
ఇది మహావారాహి యొక్క స్వరూపం…
ఇంకా
లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహి గా
అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది.
వారాహి అనగా భూదేవి, ధాన్యలక్ష్మి…ఆవిడ తన చేతుల్లో నాగలి, రోకలి ధరించి ఉంటుంది…వీటిల్లోని ఆంతర్యం ఏంటంటే…రోకలి ధాన్యం నించి పొట్టు వేరు చేయడానికి వాడుతారు…
అలగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను అమ్మ వేరు చేస్తుంది…నాగలి భూమిని విత్తనం వేసేముందు తయారు చేయడానికి వాడతాం..అలాగే అమ్మ కూడా మన బుద్ధిని నిష్కామకర్మ వైపు వెళ్ళేలాగా ప్రేరణ చేస్తుంది….
పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే, ఉగ్రం వారాహి…
శ్రీ విద్యా గద్యంలో
“అహంకార స్వరూప దండనాథా సంసేవితే,
బుద్ధి స్వరూప మంత్రిణ్యుపసేవితే”
అని లలితను కీర్తిస్తారు…
దేవీ కవచంలో
“ఆయూ రక్షతు వారాహి” అన్నట్టు…ఈ తల్లి ప్రాణ సంరక్షిణి….ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం
ప్రకృతి పరంగా చూసినట్లైతే…ఈ సమయంలో వర్షం కురుస్తుంది…రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు…దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మీ స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది…
అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికి…బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి…ముఖ్య ప్రాణ రక్షిణి…
హయగ్రీవ స్వామి అగస్త్యులవారికి చెప్పిన వారాహి నామాలు…
-పంచమి
-దండనాథా
-సంకేతా
-సమయేశ్వరి
-సమయ సంకేతా
-వారాహి
-పోత్రిణి
-వార్తాళి
-శివా
-ఆజ్ఞా చక్రేశ్వరి
-అరిఘ్ని
దేశం సుభిక్షంగా ఉండాలని…మనమంతా చల్లగా ఉండాలని…ధర్మం వైపు మనం నడవాలని…అమ్మ మహావారాహి పాదాలను పట్టి ప్రార్దనచేద్దాం.
ధూర్తానామతి దూరా వార్తాశేషావలగ్న కమనీయా
ఆర్తాళీ శుభదాత్రీ వార్తాళీ భవతు వాంఛితార్థాయ…..
సర్వం శ్రీవారాహి(దండిని) చారణారవిందార్పణమస్తు…!
నవరాత్రులు ఈ నెల జూన్ 26 వ తారీకు నుండి మొదలవుతున్నాయి జులై 4 తారీకు తో ముగుస్తున్నాయి..
వారాహి దేవిని వేద మాసం మరియు ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో పూజిస్తారు.
శ్రీ విద్యా సంప్రదాయంలో, మనకు నాలుగు రకాల నవరాత్రులు ఉన్నాయి.
వాటిలో,
ఆషాఢ మాసంలో వచ్చేది వారాహి నవరాత్రి అంటారు.
లలితా త్రిపురి సుందరి మొత్తం సైన్యాన్ని పూర్తిగా నియంత్రించే సైన్యాధిపతి వారాహి దేవి. లలితా దేవి విల్లు మరియు బాణం నుండి 5 విభిన్న శక్తులు ఉద్భవించాయి, ఇవన్నీ కలిసి వారాహి దేవిని ఏర్పరుస్తాయి .
వారాహి దేవి రథాన్ని
“కిరి చక్రం” అని పిలుస్తారు. ఈ రథాన్ని వెయ్యి పందులు లాగుతాయని, దీనికి నియంత్రిక “స్థంబినీ” దేవి అని పురాణాలు చెబుతున్నాయి”” .
ఆయుర్వేద దేవుడు ధన్వంతరి “” అని పిలువబడే దివ్య వైద్యులతో పాటు అన్ని స్త్రీ శక్తులు ఆమె రథంలో నివసిస్తాయి. అశ్విని దేవతలు .” లలితా సహస్ర నామంలోని 27-29 శ్లోకాలు వారాహి దేవి మహిమ మరియు శక్తిని వివరిస్తాయి. రాక్షసుడు “విశుక్ర” అనే దేవత వారాహిచే నాశనం చేయబడింది.
మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకాలు.
వీరే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి.
కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహినీ మరికొన్ని సంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతోంది.
దుష్టశిక్షణ కోసమూ, భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. బ్రాహ్మణి, వైష్టవి, మహేశ్వరి, ఇంద్రాణి, వరాహి, కౌమారి, చాముండ, నరసింహీ, వినాయకీగా పిలవబడే సప్త మాత్రికల్లో ఒకరుగా వరాహ దేవి అమ్మవారిని చెబుతారు. పురుష అవతారాల నుండి ఉద్భవించిన వారే ఈ సప్త మాత్రికలు.
బ్రహ్మ నుండి బ్రాహ్మణి, విష్ణువు నుండి వైష్ణవి, పరమేశ్వరుని నుండి మహేశ్వరి, ఇంద్రుని నుండి ఇంద్రాణి, వరాహావతారం నుండి వరాహి, స్కంధ నుండి కౌమారీ, నరసింహావతారం నుండి నరసింహి, వినాయకుని నుండి వినాయకీ సప్త మాత్రికలుగా ఉద్భవించారు. వారిలోని వరాహి అవతారం ప్రత్యేకమైనది. ఆమె వరాహి దేవిగా పిలవబడుతూ, ఆ పరమేశ్వరుని క్షేత్రానికి క్షేత్ర పాలికగా కాపు కాస్తోంది.
పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి, భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది.
లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి.
ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయం ఉండదనీ, జ్ఞానం సిద్ధిస్తుందనీ, కుండలినీ శక్తి జాగృతం అవుతుందనీ… తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం.
వారాహిదేవి పేర ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలనూ పఠిస్తే సకలజయాలూ సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయం.
కాశీ క్షేత్ర పాలికే ఈ సప్తమాత్రిక..
సాక్షాత్తూ పరమ శివుడు కొలువై ఉన్న కాశీ పట్టణానికి క్షేత్ర పాలికగా వరాహిదేవిని కొలుస్తారట. చాలా చోట్ల శివుడే క్షేత్ర పాలకుడుగా ఉంటాడు. కానీ, ఆ పరమ శివునికే ఈ వరాహి దేవి క్షేత్ర పాలికగా ఉందన్న మాట.
కాశీ పట్టణానికే కాదు, తంజావూర్ బృహదీశ్వరాలయానికీ ఈ మాత క్షేత్ర పాలికగా కాపలా కాస్తోందట.
తంజావూర్ బృహదీశ్వరాలయంలో ఈ అమ్మవారికి ప్రత్యేకంగా ఓ ఆలయం ఉంది. ఆ ఆలయంలో అమ్మ నల్లని రాతితో వరాహ ముఖంతో నిండుగా, ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది. ఆ రూపాన్ని చూడాలంటే, నిజంగా పెట్టి పుట్టాలంతే అన్నట్లుగా ఉంటుంది అమ్మవారి రూపం ఇక్కడ.
కాశీ నగరంలో అయితే, నీలి రంగులో దర్శనమిస్తుంది.
వరాహ రూపంలోనే ఆరు చేతులూ శంఖు, సుదర్శన చక్రాలతో శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది.
సప్త మాత్రికలందరిలోనూ ఈ అమ్మవారు అత్యంత ప్రత్యేకమట. అందుకే అమ్మను క్షేత్ర పాలిక అంటారు. చాలా శక్తివంతురాలిగా వరాహి దేవిని స్తుతిస్తారు. రాక్షసులను మట్టు పెట్టే సమయంలో ఆమె చూపిన తెగువకు చిహ్నంగానే ధైర్యసాహసాలకు ప్రతీకగా ఆమెను కొలుస్తారు.
ఈ వారాహి దీవి ద్వాదశనామ స్తోత్రం పారాయణం చేస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైన త్వరగా పూర్తీ అవుతాయి అని చెప్తారు..
🌻 శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం :
అస్య శ్రీవారాహీ ద్వాదశ నామ స్తోత్రస్య అశ్వానన ఋషిః |
అనుష్టుప్ఛందః | శ్రీవారాహీ దేవతా |
శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం |
సర్వ సంకట హరణ జపే వినియోగః ||
పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ |
తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ శివా || 1 ||
వార్తాలీ చ మహాసేనాఽఽజ్ఞాచక్రేశ్వరీ తథా |
అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే || 2 ||
నామ ద్వాదశధాభిజ్ఞ వజ్రపంజరమధ్యగః |
సఙకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః || 3 ||
ఇతి శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం ||
వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీరఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో, ఎనిమిది చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో… శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది.
గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది.
తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత. అందుకే ఈమెను రాత్రివేళల్లో పూజించడం జరుగుతుంది . వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్టించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళల్లోనో, తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి (ఒడిశా), వారణాసి, మైలాపుర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ.
లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితాసహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి.
ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయం ఉండదనీ, జ్ఞానం సిద్ధిస్తుందనీ, కుండలినీ శక్తి జాగృతమవుతుందనీ… తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం.
వారాహిదేవి పేర ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలనూ పఠిస్తే సకలజయాలూ సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయం.
🌻 వారాహి దేవి నవరాత్రి పూజా నియమాలు :-
ఈ వారాహి నవరాత్రి పూజను స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు.
ఈ నవరాత్రి దీక్షను చేసేవారు ఆషాఢ శుద్ధ పాడ్యమి మొదలుకొని ఆషాఢ శుద్ధ దశమి వరకు ఈ దీక్ష నియమాలు పాటించాలి.
నవరాత్రి పూజ చేసేవారు మధ్యము మాంసము తీసుకోరాదు.
బ్రహ్మచర్యం పాటించాలి.
ఈ పది రోజులపాటు ఏకభుక్తం చేయాలి అనగా ఒక పూట మాత్రమే భోజనము చేయాలి ఉదయము రాత్రి ఫలహారం తీసుకోవాలి
ఈ పది రోజులపాటు భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఆరాధన చేసుకోవాలి.
నవరాత్రి పూజ చేసేవారు ఈ పది రోజులపాటు ఉదయం సాయంత్రం కూడా అమ్మవారి పూజ చేయాలి .
నవరాత్రి పూజ మొదలు పెట్టిన తర్వాత ధర్మబద్ధమైన పనులు మాత్రమే చేయాలి
నవరాత్రి పూజ మొదలుపెట్టిన తర్వాత అకారణంగా పూజ మానివెయ్యకూడదు
నవరాత్రి పూజ చేసే వారు నేలపైనే నిద్రపోవాలి.
ఈ నియమాలు పాటిస్తూ అమ్మవారి పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది
🌻 నవరాత్రి పూజ విధానం :-
ఏ పూజ అయిన సరే మొదట విఘ్నేశ్వరునికి పూజించాలి.
మీ సంకల్పము అంటే నీ కోరిక ఆయనకి చెప్పుకొని (విఘ్నేశ్వరుని పూజ మొదటి రోజు చేసుకుంటే సరిపోతుంది),,
ఈ నవరాత్రులకి ఏ ఆటంకం రాకుండా చూసుకోమని స్వామివారికి చెప్పుకోవాలి,, తర్వాత అమ్మ పరివారాన్ని తలుచుకొని మీ నవరాత్రుల దీక్షను ప్రారంభించాలి..
🌻 చదువుకోవలసినవి :
వారాహి ద్వాదశ నామాలు 9 సార్లు తర్వాత వారాహి కవచం, కాలభైరవాష్టకం.. మీకు ఎంత కుదిరితే అంతా అమ్మ నామస్మరణ ధ్యానం చేసుకోండి..
🌻 నైవేద్యాలు :
బెల్లం పానకం,, దానిమ్మ గింజలు,,తీపిదుంపలు,,శనక్కాయలు,, బీట్రూట్ క్యారెట్ ఏదన్న సరే భూమిలో పండినవి చక్కగా కడిగేసి అమ్మకి నివేదన చేసి ఆ తర్వాత మనం ఇంట్లో వాటిని వాడుకోవచ్చు. ఎరుపు పుష్పాలు సువాసన భరితమైన పుష్పాలు అమ్మకి సమర్పించుకోవాలి..
ప్రతి ఒక్కరు కూడా వారాహి అమ్మని ఇంట్లో సంతోషంగా పూజించుకోవచ్చు ఎందుకంటే ఈ పూజ పద్ధతి అంతా కూడా సాత్వికమైనదే ,, ముఖ్యంగా మనకి ఉండాల్సింది అమ్మ పైన నమ్మకం,,నమ్మకంతో సంతోషంగా పూజించుకొండి..
మీరు ఈ నవరాత్రులు ఇంట్లో నిత్య పూజలా కూడా చేసుకోవచ్చు అంటే ఉదయం సాయంత్రం స్నానం చేసి దీపం పెట్టుకొని వారాహి దేవి ద్వాదశ నామాలు మరియు కాలభైరవాష్టకం ఇంకా మీ వీలును బట్టి చదువుకోవచ్చు,, బ్రహ్మచర్యం పాటించాలి, మాంసాహారం తినకూడదు, రెండు పూటలా కూడా స్నానం చేసి ఉతికిన బట్టలే ధరించి పూజలో కూర్చోవాలి..
మీరు నిష్టగా చేసుకుంటాను అంటే కలసస్థాపన చేసి అఖండ జ్యోతిని పెట్టుకొని అమ్మవారికి మీ పూజను అందించుకోవచ్చు..బ్రహ్మచర్యం పాటించాలి మాంసాహారం తినకూడదు ఇంట్లో వండకూడదు,,చాప వేసుకుని నేల మీద పడుకోవాలి ( మీ ఆరోగ్య రిత్యా చూసుకోండి) తక్కువ మాట్లాడి ఎక్కువ అమ్మ నామాన్ని స్మరించుకోవాలి,,అతిగా తినకూడదు సాత్వికంగా తినాలి ..
మనకు వున్న అన్ని సమస్యలకు సమాధానం శ్రీ వారాహి అమ్మవారి ఆషాడ మాస నవరాత్రి దీక్ష
అత్యంత శుభ ఫలితాలను మనో అభీష్టాలను నెరవేర్చే శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు
🌻 గుప్త నవరాత్రులు :
ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాడ శుద్ధ నవమి వరకు గల సమయం ఇవి ఎక్కువగా ప్రచారంలో లేవు.
చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
మన సాంప్రదాయంలో ఉన్న నాలుగు నవరాత్రుల్లో అత్యంత మహిమాన్వితమైనవి శక్తివంతమైనవి శ్రేష్ఠమైనవి .
ఈ ఆషాడ మాస గుప్త నవరాత్రులు
సమస్యలను సులభంగా పరిష్కరించే వరాలిచ్చే తల్లి వారాహి
ఎవరైతే ఈ నవరాత్రులు శ్రద్ధగా ఆచరిస్తారో వారి యొక్క అన్ని సమస్యలు అమ్మవారి అనుగ్రహం తో తప్పకుండా పరిష్కారం అవుతాయి .
శ్రీ వారాహి అమ్మవారు
ఉగ్ర రూపంలో కనిపించే అపార కరుణామయి పరమ కృపా మయి వారాహి దేవత వారాహి ఆరాధన అందరూ చేయకూడదు అని కొన్ని అపోహల వలన అమ్మవారి ఆరాధన తక్కువ మందికి మాత్రమే తెలుసు అలాగే ఎవరికి తెలియకుండా గుప్తంగానే మిగిలిపోయాయి .
ఇది పూర్తిగా సత్యదూరం ప్రస్తుత కాలంలో అమ్మవారి ఆరాధన ప్రతి ఒక్కరికి అవసరం. అమ్మవారి ఆరాధనతో అరిషడ్వర్గాలు ఆధీనంలో ఉంటాయి. కామ క్రోధ మద మోహ మద మాత్సర్యాల నుండి అమ్మవారు మనల్ని సంరక్షిస్తుంది. మన మనసును నియంత్రిస్తుంది. అమ్మవారు సమయ సమయ సంకేత ఏది ఎప్పుడు ఎలా చేయాలో ఎలా సాధించాలో తెలియజేస్తూ ఉంది అమ్మవారు .
సాక్షాత్ వసుంధర భూదేవి నాగలిని రోకలిని ధరించిన ధాన్య దేవత.
పంటలు సరిగా పండాలన్న, వ్యవసాయం అనుకూలించాలన్నా, ప్రతి ఒక్క రైతు తప్పక వారాహి ఆరాధన చేయాలి. శ్రీకరి శుభకరీ సర్వమంగళ కారిణి కళ్యాణ స్వరూపిణీ అమంగళం నాశిని సుమంగళి కారిని సౌభాగ్య ప్రదాయిని విశుక్ర ప్రాణ హరిని
వారాహి అమ్మవారు
వారాహి అమ్మవారి ఆరాధన అత్యంత శుభప్రదం సౌభాగ్య ప్రదం.
ఎటువంటి తీవ్ర సమస్యలైన అమ్మవారి ఆరాధన పరిష్కారం లభిస్తుంది .
అమ్మవారి ప్రీతిగా ఈ నవరాత్రులు శ్రద్ధగా నిష్ఠతో ఆచరిస్తే మన యొక్క మనో అభీష్టాలు తప్పకుండా తీరుతాయి భూమి పరమైన సమస్యలు ఉన్న, భూ తగాదాలు ఉన్న, కోర్టు కేసులు ఉన్న, శత్రు సమస్యలు ఉన్న, తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నా, జీవితంలో స్థిరత్వం లేకపోయినా, మనకంటూ రక్షణ లేకపోయినా, ఇంట్లో తరచుగా అరిష్టాలు జరుగుతున్న, ఆర్థిక స్థిరత్వం లేకపోయినా, ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు ఎక్కువైనా, అమ్మవారి నవరాత్రి దీక్ష చేస్తే ఈ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి .
అమ్మవారి ఆరాధనతో ఫలానా సమస్య అంటూ ఉండదు ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది.
కాబట్టి మిత్రులారా మహిమాన్విత నవరాత్రి దీక్ష అందరూ చేపట్టండి దీక్ష విధానం తెలియజేస్తాను.
🌻 నవరాత్రి దీక్ష విధానం :
నవరాత్రి ప్రారంభం ముందు రోజు అనగా మీ గృహాన్ని శుభ్రం చేసుకోండి పూజ కి కావాల్సిన ద్రవ్యాలు తెచ్చి పెట్టుకోండి.
పూజా ద్రవ్యాలు అనగా ప్రతి అమ్మవారి పూజలో ఉపయోగించే పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు నూనె సామ్రాణి.
అవకాశం ఉన్నవారు మీ పూజ గదిలో ఒక పీటను పెట్టి, దాని మీద ఎర్రని వస్త్రం పరిచి, వారాహి అమ్మవారి చిత్ర పటం కానీ విగ్రహం కానీ ఉంటే పెట్టండి. ఒకవేళ ఇవి రెండు లేకపోతే లలిత అమ్మవారి చిత్రపటం కానీ, దుర్గ అమ్మవారి చిత్ర పటం కానీ, విగ్రహం కానీ, పెట్టండి. ఇది ఒక రోజు ముందుగా సిద్ధం చేసుకుని పెట్టండి .
నవరాత్రి దీక్ష ప్రారంభం అయ్యే రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, అవకాశం ఉన్నవారు దీక్ష వస్త్రాలు ధరించండి. దీక్ష వస్త్రాలు ధరించడం వీలు కాని వ్యక్తులు మెడలో దీక్షగా ఒక కండువా తొమ్మిది రోజులు ధరించాలి.
ముందుగా సిద్ధం చేసుకున్న అమ్మవారి పీఠం దగ్గర దీపారాధన చేసి మీరు ఏ సంకల్పంతో నవరాత్రి దీక్ష చేస్తున్నారో ఆ సంకల్పాన్ని అమ్మవారికి మనస్ఫూర్తిగా తెలియజేయాలి పిమ్మట గణపతి ప్రార్థన చేసి పూజ ప్రారంభించాలి .
అవకాశం ఉన్నవారు అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేయండి. అభిషేకం అనునది తప్పనిసరికాదు అమ్మవారికి స్త్రీ మూర్తులు ఎర్రటి చీర ఎర్రని గాజులు 9 రోజులు పీఠం దగ్గర ఉంచండి. అవకాశం ఉన్న మహిళలు ఆచరించండి. వారాహి అష్టోత్తర నామాలు కానీ సహస్రనామాలు కానీ మీకు లభ్యమైతే వీటిని పఠిస్తూ అమ్మవారి ముందు కుంకుమార్చన చేయండి. ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని అర్చించండి. దానిమ్మ గింజలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి .
ఈ తొమ్మిది రోజులు పాదరక్షలు ధరించకూడదు. మాంసానికి మద్యానికి దూరంగా ఉండండి. బ్రహ్మచర్యం పాటించండి. మంచం మీద పడుకోవద్దు. నేల పైన చాప వేసి పడుకోండి .
ఈ తొమ్మిది రోజులు ఉదయం మరియు రాత్రి రెండు పూటలా స్నానం చేసి అమ్మవారికి దీపం ధూపం నైవేద్యం పెట్టాలి
వారాహి అమ్మవారి సంబంధిత స్తోత్ర పఠనం ఈ తొమ్మిది రోజులు విశేషంగా చేయాలి ఇది ఆచరించడం కొంతమందికి ఇబ్బందికరంగా అయినప్పటికీ అమ్మవారి అనుగ్రహం పొందడానికి సులభ పరిష్కార మార్గం ఇది .
ఇది ఆచరించడం సాధ్యం కాని వారికి సులభంగా నవరాత్రి దీక్ష చేసే విధానం..
దీక్ష వస్త్రాలు లేకున్నా ఇబ్బంది లేదు కానీ మెడలో దీక్ష కండువా తొమ్మిది రోజులు ధరించాలి. పీఠం పెట్టి అమ్మవారిని పూజించడం ఇబ్బందికరంగా ఉంటే మీ పూజ గదిలో అమ్మవారి చిత్రపటానికి ఉదయం సాయంత్రం రెండు పూటలా స్నానం చేసి దీపారాధన చేసి పూలు పండ్లు నైవేద్యంగా పెడితే సరిపోతుంది.
తొమ్మిది రోజులు చెప్పులు వేసుకో కూడదు. మద్యానికి మాంసానికి దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. నేలమీద పడుకోవాలి. స్తోత్ర పారాయణం చేయడం కుంకుమార్చన చేయడం ఇబ్బందికరంగా ఉన్న వ్యక్తులు వారాహి అమ్మవారి ద్వాదశనామాలు ఉదయం సాయంత్రం చదివితే సరిపోతుంది. అత్యంత సులభంగా మీ వృత్తులు చేసుకుంటూ అమ్మవారి నవరాత్రి దీక్ష చేసే విధానాన్ని సులభంగా మీకు తెలియజేశాను..
అవకాశం ఉన్నవారు అమ్మ వారి దీక్ష చేయండి సకలశుభాలు అష్ట ఐశ్వర్యాలు సర్వ సుఖాలు పొందండి .
అమ్మవారి పీఠం ముందు సమర్పించే చీర గాజులు అనారోగ్య వ్యక్తులను ఆరోగ్యవంతులుగా చేస్తుంది.
కల్యాణం కానీ స్త్రీలకు శీఘ్రంగా కళ్యాణాన్ని చేస్తుంది.
సంతానానికి దూరంగా ఉన్న వ్యక్తులకు సంతానాన్ని సౌభాగ్యాన్ని ఏర్పరుస్తుంది .
అమ్మవారి ముందు చేసే కుంకుమార్చన ఆ యొక్క కుంకుమ ఎంతో మహిమాన్వితమైనది. ఈ కుంకుమను భద్రంగా దాచుకోండి. ప్రతిరోజు ఈ కుంకుమను ధరించడం వల్ల జయము విజయము వెంటే ఉంటాయి .
అవకాశం ఉన్నవారు తొమ్మిది రోజులు అమ్మవారి ముందు అఖండ దీపారాధన చేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు విపరీత ప్రభావాలు తొలగిపోతాయి .
దీక్ష చేయడం సాధ్యం కాని వ్యక్తులు కనీసం తొమ్మిది రోజులు చెప్పులు వేసుకోకుండా ఉండండి .
ఈ తొమ్మిది రోజులు అమ్మవారి ముందు పీచు తీయని కొబ్బరికాయ ఉంచండి నవరాత్రి దీక్ష పూర్తయిన తర్వాత ఈ పీచు తీయని కొబ్బరికాయను మీ ఇంట్లో లేదా వ్యాపార కార్యాలయంలో ఒక ఎర్రని బట్టలో కట్టి ఉంచండి తొమ్మిది రోజులు అమ్మవారి పూజలో కొబ్బరికాయ ఉండటంవల్ల శక్తివంతంగా మారుతుంది .
అవకాశం ఉన్నవారు అమ్మ వారి ముందు ఈ తొమ్మిది రోజులు కొన్ని రక్షా కంకణాలు పెట్టుకోండి నవరాత్రి దీక్ష అయిన తర్వాత ఈ రక్ష కంకణాలు చేతికి కట్టుకోండి .
ఈ తొమ్మిది రోజుల్లో మెడలో ధరించే కండువాను భద్రంగా ఉంచుకోండి.
ఏవైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లినప్పుడు లేదా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు ఈ కండువాను ధరిస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయి .
🌻 నవరాత్రి ముగింపు దశలో పుజ :
ఉదయం అమ్మవారికి నైవేద్యం మంగళహారతి ఒక కొబ్బరికాయను కొట్టి దీక్షను ముగించాలి. కండువా తీసి పక్కకు పెట్టాలి. మనం ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నాము ఆ సమస్యను అమ్మవారికి చెప్పి ఆ సమస్యకు పరిష్కార మార్గం ఇవ్వమని అమ్మవారిని వేడుకోవాలి .
ఆమె సాధన సాధారణంగా రాత్రి సమయాల్లో జరుగుతుంది, ఎందుకంటే ఇది అంతర్గత మరియు బాహ్య శత్రువులను నాశనం చేయడానికి ఉద్దేశించబడింది. ఆమెకు ఒక సాధారణ వేద మంత్రం క్రింద ఉంది. ఈ మంత్రాన్ని ఎవరైనా పఠించవచ్చు .
ఓం వారాహి!
సర్వతో మాం రక్ష రక్ష
దుర్గే హుష్ ఫట్ స్వాహా
ఆమె గాయత్రి మంత్రాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
వీటిని ఎవరైనా పఠించవచ్చు మరియు దీక్ష అవసరం లేదు.
మహిషవాహనాయై చ విద్మహే ।
దణ్డహస్తాయై చ ధీమహి ।
తన్నో వారాహీ ప్రకోదయాత్ ॥
మహిషవాహనాయై చ విద్మహే ।
దణ్డహస్తాయై చ ధీమహి ।
తన్నో వారాహీ ప్రచోదయాత్ ॥
🌻 శ్రీ వారాహి దేవి మూల మంత్రం :
ఓం ఐం హ్రీమ్ శ్రీమ్ ఐం గ్లౌం ఐం
నమో భగవతీ వార్తాళి వార్తాళి
వారాహి వారాహి
వరాహముఖి వరాహముఖి
అన్ధే అన్ధిని నమః
రున్ధే రున్ధిని నమః
జమ్భే జమ్భిని నమః
మోహే మోహిని నమః
స్తంభే స్తంబిని నమః
సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేశామ్
సర్వ వాక్ సిద్ధ సక్చుర్
ముఖగతి జిహ్వా
స్తంభనం కురు కురు
శీఘ్రం వశ్యం కురు కురు
ఐం గ్లౌం ఠః ఠః ఠః ఠః
హుం అస్త్రాయ ఫట్ స్వాహా ||
వారాహి మూల మంత్రం ఒక్క రోజులో 3 లేక 21 లేక 108 సార్లు,
48 రోజుల పటు జపించినచొ మీ జాతకం లోని కాలసర్ప దోషం లేక ఎలాంటి దోషాలైనా దూరమవుతాయి జనాకర్షణ పెరుగుతుంది వాక్ సిధ్ధీ కలుగుతుంది .
వారాహి దేవికి నైవేద్యంగా దానిమ్మ పండు, బెల్లం పానకం, పులిహోర సమర్పించవచ్చు.
బ్రహ్మ ముహూర్తం లో వారాహి దేవీ ఆరాధన చేయటం తో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.
వారాహి అమ్మవారి ఆరాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. భక్తి శ్రద్ధలతో అమ్మవారి నవరాత్రి దీక్ష ఆచరించండి.
🙏 ఓం శ్రీ వారాహి దేవియై నమః
🙏 ఓం శ్రీ మాత్రే నమః
🍀🌻🍀🌻🍀🌻🍀🌻🍀
Discover more from
Subscribe to get the latest posts sent to your email.