నారద వర్తమాన సమాచారం
మాచర్ల డివిజన్ తెలుగు నాడు విద్యుత్ కార్మిక సంఘం నూతన కార్యవర్గం నియామకం..
గురజాల చల్లగుండ్ల గార్డెన్స్ నందు మాచర్ల డివిజన్ తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. ఏపీసీపీడీసీఎల్ కంపెనీ కార్యదర్శి NSRK ప్రసాద్ అధ్యక్షతన నూతన కార్యవర్గం నియామకం జరిగింది. డివిజన్ అధ్యక్షులుగా జి .పాండురంగారావు, కార్యదర్శిగా షేక్ బడేసా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాజశేఖర్, సహాయ కార్యదర్శిగా మెట్టల.వెంకటేశ్వర్లు, కోశాధికారిగా జలగం శ్రీనివాసరావు ల ఎన్నిక జరిగింది. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీరామ మూర్తి , పల్నాడు జిల్లా అధ్యక్షులు అడుసుమల్లి శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా కన్వీనర్ షేక్ జానీ భాష పాల్గొన్నారు. నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులకు ఆర్ ఓ కార్యాలయ సిబ్బంది, క్షేత్రస్థాయి సిబ్బంది పలువురు అధికారులు నాయకులు అభినందనలు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.