నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణా రావు ఐపిఎస్
ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక,ఆస్తి తగాదాలు,మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 117 ఫిర్యాదులు అందాయి.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
వినుకొండ పట్టణమునకు చెందిన కంచర్ల కోటేశ్వరమ్మ భర్త అయిన కృష్ణ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు,ఫిర్యాది భర్త లారీ కొనుగోలు చేసుకోవాలని ముప్పాళ్ళ మల్లికార్జున రావు అను అతనిని తనఖా పెట్టుకొని డబ్బులు ఇప్పించమని అడగగా, ముప్పాళ్ళ మల్లికార్జునరావు ఎండ్లూరి అరుణ అను ఆమెను అడుగగా ఆమె ఒప్పుకొని ఫిర్యాది ఇంటి పత్రాలను ఎండ్లూరి అరుణ తనఖా రిజిస్ట్రేషన్ చేసుకుని 5,75,000/- రూపాయలు అప్పుగా ఇచ్చినట్లు, ఫిర్యాది ది.20.09.2025 వ తేదీన తన తనఖా అప్పు మొత్తం చెల్లించి తనఖా రిజిస్ట్రేషన్ రద్దు చేసుకొని తన రిజిస్టర్ కాగితాలను ఇవ్వమని అడగగా అదిగో,ఇదిగో ఇస్తాను అని చెబుతూ కాలయాపన చేస్తున్నట్లు, అసలు విషయము గురించి ఫిర్యాది విచారించుకోగా ఎండ్లూరి వెంకట్రావు, ఆమె భార్య అయిన ఎండ్లూరి అరుణ మరియు ముప్పాళ్ళ మల్లికార్జునరావు ముగ్గురు కలిసి ఫిర్యాదిని తనఖా రిజిస్ట్రేషన్ అని చెప్పి ఫిర్యాది ఆస్తిని అమ్మినట్టుగా విక్రయ రిజిస్ట్రేషన్ చేయించుకుని మోసం చేసినట్లు, ఆ విషయమై ఫిర్యాది గట్టిగా నిలదీయగా పై ముగ్గురు ఫిర్యాదిని మరియు ఫిర్యాది భర్త పైకి వచ్చి కొట్టి వారి ఇష్టం వచ్చినట్లుగా అసభ్యకరంగా తిట్టినట్లు,అందుకు గాను న్యాయం చేయవలసిందిగా ఫిర్యాది ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
బొల్లాపల్లి మండలం షోలాయపాలెం గ్రామానికి చెందిన గుంజా వెంకటేశ్వర్లు అను అతను తన స్వార్జితం తో 8 ఎకరాల భూమి మరియు నాలుగు ఇండ్లను నిర్మించుకొన్నట్లు, ఫిర్యాది కి ఇద్దరు ఆడ, ముగ్గురు మగ సంతానం కాగా ఇద్దరు ఆడపిల్లలకు వివాహం చేసినట్లు,8 ఎకరాల భూమిని తన ముగ్గురు కుమారులు అయిన గుంజా బాల గురవయ్య,
గుంజా చిన వీరయ్య, గుంజా కోటయ్య అను వారికి వ్రాసి ఇచ్చినట్లు, ఐదు సంవత్సరముల క్రితం ఫిర్యాది భార్య అనారోగ్యంతో చనిపోయినట్లు,అయితే ఈ మధ్యన ఫిర్యాది కి క్యాన్సర్ వచ్చినట్లు డాక్టర్లు తెలుపుగా చికిత్స నిమిత్తం తన వద్ద ఉంచుకున్నటువంటి భూమిని అమ్ముకోనివ్వకుండా ముగ్గురు కుమారులు ఇబ్బంది పెడుతున్నందుకు గాను ఆస్థిని అమ్ముకోవడం కొరకు వారి నుండి రక్షణ కల్పించవలసిందిగా ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
దుర్గి గ్రామానికి చెందినటువంటి శ్రీరామ్ సాయి చక్రవర్తి అను అతను ఇంటర్మీడియట్ వరకు చదువుకొని ఇంటి వద్ద ఖాళీగా ఉన్నట్లు, అదే సమయంలో దుర్గి మండలం కోలగుట్ల గ్రామానికి చెందిన శ్రీ కర్రావుల శ్రీకాంత్ అను అతను పరిచయమైనట్లు, కర్రావుల శ్రీకాంత్ ఫిర్యాది తో నీకు ఉద్యోగం ఇప్పిస్తాను, నాకు తెలిసినవారు పెద్దవారు ఉన్నారు అని చెప్పి 2,00,000/- రూపాయలు ఇస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఫిర్యాదు వద్ద 2,00,000/- రూపాయలు తీసుకున్నట్లు,ఇప్పటికీ సంవత్సరం దాటిపోయిననూ ఉద్యోగం గురించి అడుగుతుంటే చూస్తాను అని చెప్పి తప్పించుకు తిరుగుతున్నట్లు, అయితే ఫిర్యాది ఉద్యోగం వద్దు డబ్బులు ఇవ్వమని అడిగితే డబ్బులు లేవు, వరికి చెప్పుకుంటావో చెప్పుకో అని బెదిరిస్తున్నందుకు గాను శ్రీ కర్రావుల శ్రీకాంత్ మీద చర్యలు తీసుకుని డబ్బులు ఇప్పించవలసిందిగా ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.
రెంటచింతల కు చెందిన ఎర్రపాటి.లక్ష్మీ రాజ్యం అను ఆమె టైలరింగ్ చేసుకుని జీవనం సాగిస్తున్నట్లు, ఫిర్యాది తన టైలరింగ్ షాప్ మీద తుమ్రకోట యూనియన్ బ్యాంక్ నందు 5,60,000/-రూపాయలు నగదు ముద్ర లోన్ తీసుకున్నట్లు,ఆ నగదును VOXLUBE Enterprises Private Limited Company పేరు మీద B.శ్యామ్ రాజు అను అతని అకౌంట్లో సదరు డబ్బులు పడగా, ఫిర్యాది కు మూడు లక్షల రూపాయలు విడతల వారీగా ఇచ్చినట్లు, శ్యామరాజు అను అతను స్వగ్రామం గిద్దలూరు కాగా గుంటూరు లో నివాసం ఉంటున్నట్లు, అతను మిగిలిన 2,60,000/- రూపాయలు నగదు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు, డబ్బులు అడిగితే ఏమి చేసుకుంటావో చేసుకో అంటున్నందుకు గాను తనకు న్యాయం చేయవలసిందిగా ఫిర్యాది ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.
శావల్యపురం మండలం మతుకుమల్లి గ్రామానికి చెందిన ఎర్రగుంట.సంపంగిరావు అను అతను ఆన్లైన్ మార్కెట్ చెక్ చేస్తుండగా ఒక ఫోన్ నెంబరు కలిసినట్లు,ఆ ఆన్లైన్ ఫోన్ నెంబర్ నుండి ఒక స్త్రీ మాట్లాడి ఆమె పేరు T.లావణ్య అని చెప్పినట్లు, వారిది రైస్ బిజినెస్ అని వారి వ్యాపారంలో పెట్టుబడి పెడితే 3 నెలలకు డబల్ వస్తుందని చెప్పగా ఫిర్యాదు కి గతం లో అప్పులు ఉన్న కారణంగా ఆ అప్పులు తీర్చుకోవడం కొరకు మళ్లీ వేరే వారి వద్ద అప్పు తెచ్చి 7,00,000/- రూపాయలు బ్యాంకు లో వారు చెప్పిన అకౌంట్ కు డబ్బులు కట్టినట్లు, డబ్బులు కట్టిన రెండు నెలల వరకు ఫోన్ ద్వారా కాంటాక్ట్ లో ఉండి తరువాత ఫోన్ కాంటాక్ట్ లో లేనట్లు అంతట తాను మోసపోయానని ఫిర్యాదు తెలుసుకొని న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహయ సహకారాలు అందించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.