బాల్య వివాహాల విముక్తి భారత్ పోస్టర్ ను ఆవిష్కరించిన శాసనసభలు బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ నారద వర్తమాన సమాచారం
ప్రతినిధి: బంధనకంటి :శంకర్
మిర్యాలగూడ పట్టణంలో “జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్” ” అశ్రీత స్వచ్చంధ సంస్థ “ఆధ్వర్యంలో బాల్య వివాహలకు వ్యతిరేకంగా 100 రోజుల కాంపెయిన్ లో భాగంగా రూపొందించిన “బాల్య వివాహాల విముక్త్ భారత్ ” పోస్టర్ ను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(BLR) తన క్యాంప్ ఆఫీస్ నందు ఆవిష్కరించటం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆశ్రిత స్వచ్ఛంద సంస్థలో బాల్య వివాహాల నిర్మూలన గురించి 100 రోజుల క్యాంపై నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఈ క్యాంపెయిన్ ద్వారా చిన్నపిల్లలకు వివాహాలు చేయకూడదని మంచి అవగాహన అనేది ప్రజల్లో రావడం జరుగుతుంది
అదేవిధంగా బాల్యా వివాహ “నిరోధక చట్టం 2006 ” ప్రకారంగా 18 సంవత్సరాలు అమ్మాయికి, 21 సంవత్సరాలు అబ్బాయికి నిండ కుండా వివాహం చేసినట్లయితే చట్ట ప్రకారం 1లక్ష రూపాయల జరిమానా 2 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. అనేది చట్టం తెలియజేస్తుంది కాబట్టి ఈ బాల్య వివాహం నిషిద్ధ చట్టం బాలలకు రక్షణగా ఉంటుంది దీని ద్వారా బాలలు వారి జీవితంలో
ఉన్నత చదువులు చదువుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి సమాజంలో ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలు జరగకుండ సంహకరించ వలసిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ సామజిక కార్యకర్త G. కవిత , మిర్యాలగూడెం నియోజవర్గ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







