నారద వర్తమాన సమాచారం
ఏపీ అధికారులు అప్రమత్తంగా ఉండాలి : సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పూర్తిగా తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం నారా చంద్రబాబు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రిజర్వాయర్లు, నదుల్లోకి వచ్చే నీటి ప్రవాహాన్ని అంచనా వేసి, క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కొంతమేర వరి పంట దెబ్బతిన్నందున, పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి, రైతులకు అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








