నారద వర్తమాన సమాచారం
జిల్లాలో బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలుపై సీఎం చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన కలెక్టర్
పి అరుణ్ బాబు.
బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలులో వేగం పెరగాలి. చివరి ఆకు వరకు కొనుగోలు చేయాలి పొగాకు రైతులు అధైర్యపడద్దు, పొగాకు రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రైతుల నుంచి మార్క్ ఫెడ్, ప్రవేట్ కంపెనీలు పొగాకు కొనుగోలు చేసేలా చర్యలు పొగాకు కొనుగోలుపై సీఎం యాప్ లో రైతుల పేర్లను వ్యవసాయ శాఖ సిబ్బంది రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులని సీఎం అదేసించారు.
సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతు
బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలులు గురువారం నుంచి జిల్లాలో పునఃప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పొగాకు ధరలు తగ్గి భయంతో ఆందోళన చెందుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని కలెక్టర్ చెప్పారు. వారి ఇబ్బందులను తొలగించేలా ప్రతి ఆకు కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం అధికారులు పనిచేయాలన్నారు. బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు చేయడానికి సీఎం యాప్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఇప్పుడు వరకు ఈ క్రాప్, ఏపీ ఏఎంఎస్ లో నమోదైన రైతుల వివరాలను సీఎం యాప్ కు అనుసంధానించాలన్నారు. ప్రతి పొగాకు రైతు వివరాలను యాప్ లో నమోదు చేయాలన్నారు. మార్క్ ఫెడ్ ద్వారా 25 మిలియన్ కేజీలను పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం గాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్ళించాలన్నారు. అవగాహనతో వేరొక పంటలు వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం యాప్ లో నమోదు చేసిన రైతుల నుంచి మాత్రమే పొగాకును కొనుగోలు చేస్తామని కలెక్టర్ తెలిపారు. రైతుల పేర్లు, పంట, భూమి, ప్రాంతం, సర్వేనెంబర్ లను అనుసంధానించాలన్నారు. పొగాకు రైతుల పంటల వివరాలు నిక్కచ్చిగా ఉండాలని కలెక్టర్ చెప్పారు.
వారంలోగా పొగాకు రైతుల వివరాలను ఆన్ లైన్ లో నిక్షిప్తం
చేయాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, మార్కె ఫెడ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.