నారద వర్తమాన సమాచారం
వరద నీటిలోకి ఈతకు, చేపల వేటకు వెళ్లద్దు:ఏ పీ హోంమంత్రి అనిత
శ్రీకాకుళం జిల్లాలో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు హోంమంత్రి అనిత. ముంపు మండలాల్లో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. నారాయణపురం వద్ద నాగావళిలో 60 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోందన్నారు. ప్రభావిత జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ హెచ్చరికలు పాటించాలని, వరద నీటిలోకి వెళ్లొద్దని సూచించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








