ఆంద్రప్రదేశ్
భారతదేశం సమగ్రత ఎన్డీఏ ప్రధాన ద్వేయం
ఆర్ .పి. ఐ జాతీయ కార్యదర్శి: పేరం శివ నాగేశ్వరరావు.
నారద వర్తమాన సమాచారం: ప్రతినిధి.:
జి కొండూరు మార్చి 27
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో దేశ సమగ్ర అభివృ ద్దే ప్రధాన ద్వేయమని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ)జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు పేర్కొన్నారు .ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు గ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో బుధవారం పేరం శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ. ప్రపంచ దేశాల్లోనే భారతదేశం ప్రజాస్వామ్య బద్దంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాలంలో పరిపాలన కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం చేస్తుందని తెలిపారు .మళ్లీ మూడోసారి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావడం తద్యమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అధోగతి పాలయిందన్నారు .
కేవలం రాష్ట్ర ప్రభుత్వం కొందరి సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వటం వలన అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. .ఎన్ డి ఏ కూటమిలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎ) విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తమ పార్టీ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తుందని తెలిపారు. తమ అధినేత కేంద్ర మంత్రి రామదాసు అథా వాలే
బి ఫారం ఇచ్చినట్లు తెలిపారు .ఈ కార్యక్రమంలో ఓబిసి రాష్ట్ర అధ్యక్షులు పరస రంగనాథ్, రాష్ట్ర కార్యదర్శి షేక్ మస్తాన్ వలీ, రాష్ట్ర కాపుఉప కులాల చైర్మన్ ఆర్ .సత్య వరప్రకాష్ , యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జవ్వాజి పనింద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.