నారద వర్తమాన సమాచారం
సమాజాన్ని జాగృతం చేయటంలో జర్నలిస్ట్ “ఆర్.ఎన్” కృషి మరువలేనిది.
సంస్మరణ సభ లో బి.సి. సంక్షేమ సంఘ అధ్యక్షులు కేసన
తెనాలి.
జూన్ 2:
ఒక జర్నలిస్టుగా..సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం ద్వారా వారి అభ్యున్నతి కోసం… ప్రజాప్రతినిధులకు,అలాగే అధికారులకు పలు సూచనలు ఇచ్చి వారి అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి గోపాల్ కృష్ణ అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు అన్నారు. ఆదివారం కొత్తపేటలో ఎన్జీవో హాల్లో దివంగత ఆర్.ఎన్ గోపాలకృష్ణ సంతాప సభ నిర్వహించి నివాళులు అర్పించారు.
ప్రముఖ సీనియర్ పాత్రికేయులు దివంగత ఆర్.ఎన్ గోపాలకృష్ణ సంతాప సభ స్థానిక ఎన్జీవో హోంలో జరిగింది. ఈ సభకు బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. తొలుత జర్నలిస్ట్ ఆర్ ఎన్ గోపాలకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కేశన శంకర్రావు మాట్లాడుతూ సమాజాన్ని జాగృతి చేసే అంశాల్లోనూ, పేద ప్రజలకు, ప్రభుత్వ సేవలు అందించే దానిలో ఒక జర్నలిస్టుగా, పత్రికా రంగంలో ఆయన చేసిన విశ్లేషణలు మరువలేనివని అన్నారు. అంతేకాకుండా తన ద్వారా ఎంతోమందిని జర్నలిజంలోకి తీసుకువచ్చి పాత్రికేయ రంగంలో వారికి ఉపాధి కల్పించిన వ్యక్తి గోపాలకృష్ణని నివాళి అర్పించారు. అంతేకాకుండా సామాన్య కుటుంబంలో జన్మించి భాషా ప్రవీణ పట్టభద్రుడై, ఉపాధ్యాయ వృత్తిలో రాణించారని, ఉద్యోగానంతరం అర్చక వృత్తిలో కొనసాగుతూ అర్చకుల సమస్యలపై అనేక పోరాటాలు చేసిన వ్యక్తి గోపాల్ కృష్ణ అని నివాళిలో పేర్కొన్నారు..ఇదే కార్యక్రమానికి సీనియర్ పాత్రికేయులు నిమ్మరాజు చలపతిరావు కూడా హాజరై గోపాల్ కృష్ణకు నివాళులర్పించారు. జర్నలిస్టు వృత్తిలో ఆయన చేసిన సేవలను ప్రస్తుతించారు..
ఇంకా ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ నాయకులు పాల్గొన్నారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.