Friday, December 27, 2024

కర్నాటక లో ఊహించని స్థాయిలో భారీ వర్షాలు.. 133 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!

నారద వర్తమాన సమాచారం

జూన్ :06

కర్నాటక లో ఊహించని స్థాయిలో భారీ వర్షాలు.. 133 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!

కర్నాటక లో భారీ వర్షం కురిసింది. 133 ఏళ్ల రికార్డు బద్దలైంది. ఆదివారం నాడు అర్ధరాత్రి వరకు బెంగుళూరులో 111 మి.మి. వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ ప్రకటించింది. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులతో కొన్ని రోజులుగా బెంగుళూరు వాసులు బిందెడు నీటి కోసం కష్టాలు పడుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు కర్నాటక  వాసుల నీటి కష్టాలను తీరుస్తాయని అధికారులు అభిప్రాయ పడుతున్నారు.

1891 జూన్ 16న ఒక్క
రోజులోనే కర్నాటక లో 101.6 మి.మి.వర్షపాతం నమోదైంది. ఆ రికార్డు ఇంతవరకు బ్రేక్ కాలేదు. కానీ, నైరుతి రుతుపవనాల ప్రవేశంతో కర్నాటకలో ఆదివారం రాత్రి వరకు ఒక్క రోజులోనే రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది. జూన్ లో కర్నాటక లో సాధారణ వర్షపాతం 110.3 మి.మి. నమోదౌతుంది. అయితే గత రెండు రోజులుగా కర్నాటక లో 120 మి.మి. వర్షపాతం నమోదైందని ఐఎండీ తెలిపింది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version