హైదరాబాదులో ఆదివాసి విద్యార్థులకు హాస్టల్ భవనాలు నిర్మించాలి: ఆదివాసీ విద్యార్థి సంఘం (ఏ ఎస్ యు)
నారద వర్తమాన సమాచారం
జూన్03,
హైదరాబాదు నగరంలో చదువుకుంటున్న ఆదివాసీ విద్యార్థులకు సొంత వసతిగృహాలు నిర్మించాలని ఆదివాసీ విద్యార్థి సంఘం (ఏ ఎస్ యు) రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు సాగబోయిన పాపారావు తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కలిసి వినతి పత్రం అందజేశారు. విద్యానగర్ కొత్తపేట నాగోల్ ప్రాంతంలో ఆదివాసి విద్యార్థుల నివాస గృహము అద్దె భవనంలో కొనసాగుతుంది. ప్రభుత్వ స్థలంలో శాశ్వత వసతి గృహం నిర్మించాలని, విద్యానగర్ అడిక్మెట్ ప్రాంతంలో ఆదివాసి బాలికల వసతిగృహంలో 250 గజాల స్థలంనిరుపయోగంగా ఉంది.సొంత భవనం నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో పాటు ఆదివాసి ఎమ్మెల్యేలను కలిసి కోరడం జరిగినది. అందుకు ఆదివాసి ప్రజాప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తూ ఆదివాసీ విద్యార్థినీ, విద్యార్థుల వసతగృహాల నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందించడంతోపాటు ప్రభుత్వ పెద్దలతో చర్చించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సొంత హాస్టల్ భవన నిర్మాణాల కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం ASU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరేం అరుణ్ కుమార్, ఉపాధ్యక్షులు గౌరివేని ప్రవీణ్ కుమార్, కోశాధికారి కల్తీ వెంకన్న, సహాయ కార్యదర్శి బొచ్చు నరేష్, నాయకులు కారం రాము, సురేష్ పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.