నారద వర్తమాన సమాచారం
కన్న తండ్రిని హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదు, 20,000 /- రూపాయల జరిమాన – జిల్లా ఎస్పీ సింధుశర్మ ఐపిఎస్..
కామారెడ్డి
తేదీ 09. 03. 2021 నాడు భూక్య ఫకీరా తండ్రి ధర్మ వయసు 65, కులం లంబాడ, వృత్తి వ్యవసాయం, క్యాసం పల్లి తండా చెందిన వ్యక్తిని ఉగ్రవాయి శివార్ లో ఇంద్రసేనారెడ్డి పొలం వద్ద మృతుని కొడుకు కొట్టి ఉరి వేసినట్లు ఉన్నది అని మృతుని తమ్ముని కొడుకు భూక్య హుస్సేన్ తండ్రి చందర్ ఫిర్యాది మేరకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించడం జరిగినది.
పరిశోధనలో భాగంగా మృతుని తమ్ముని కుమారులను, కూతురిని, గ్రామస్తులను విచారించి నేరస్తుడైన / మృత్యుని కుమారుడు బుక్య భాషను అరెస్టు చేయడం జరిగింది
మృతునికి నేరాస్తుడికి భూమికి సంబంధించిన లోను డబ్బుల విషయంలో తగాదాలు కలవు. దానిని మనసులో పెట్టుకొని
తేదీ 09.03.2021 నాడు మధ్యాహ్నం అందాజా 12 గంటలకు నేరస్థుడు తన తండ్రి తో బ్యాంకులో ఉన్న లోను గురించి కామారెడ్డి వెళ్దామని చెప్పి తన బైక్ పై ఎక్కించుకొని ఉగ్రవాయి శివారికి రాగానే ఇంద్రసేనారెడ్డి పొలం దగ్గర నేరస్థుడు మృతుని దొరకబట్టి చేతులతో ఇష్టం వచ్చినట్లు కొట్టి పొట్టలో చాతి పై గుద్ది కింద పడేసి అతని మెడలో ఉన్న తువ్వాలతో మెడకు గట్టిగా చుట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినాడు. ఈ విషయములో నేరస్తుడిపై కోర్టు యందు అభియోగ పత్రం వేయడం జరిగింది.
కేసులో సాక్షులను విచారించి, సాక్షాదారాలను పరిశీలించి కేసు రుజువు కావడం జరిగినదని జిల్లా న్యాయమూర్తి డాక్టర్ సిహెచ్ విఆర్ఆర్ వరప్రసాద్ నిందుతునికి జీవిత ఖైదు పాటు 20,000 /- రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగినది.
ఈ కేసును సరియగు పద్దతిలో విచారణ చేసిన సీఐల చంద్రశేఖర్ రెడ్డి, పోలీసు తరపున వాదనలు వినిపించిన పీపీ రాజగోపాల్ గౌడ్,కోర్టు లో సాక్షులను ప్రవేశపెట్టిన ప్రస్తుత సి ఐ, రామన్, ప్రస్తుత ఎస్ఐ రాజు, కోర్ట్ కానిస్టేబుల్ బాలకృష్ణ, దేవిచంద్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.