ఇసుక డంపులపై చర్యలు శూన్యం
నిర్మల్
నారద వర్త మాన
సమాచారం
ప్రతినిది
తరుగుతున్న ఇసుక తన్నుకు తింటున్న అధికార యంత్రాంగం
వివరాల్లోకి వెళితే జూలై 3 తేదీన లక్ష్మణ్ చందా మండలం తహసిల్దార్ నీ కలిసి మండల కేంద్రంలో ఉన్న ఇసుక డంపులను పిక్స్ ద్వారా చూయించి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది ,
అదే రోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో లక్ష్మణ్ చందా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కు ఫోను ద్వారా సమాచారం అందించడం జరిగింది. నాలుగు రోజులు ఇసుక డంపుల దగ్గర రెవెన్యూ సిబ్బందిని కాపల ఉంచి
ఆ తర్వాత వాటిపై ఏమి చర్య తీసుకున్నారు అని సంబంధిత మండల అధికారిని అడిగిన సమాధానమివ్వకుండా ముఖము చాటేస్తున్న రు లక్ష్మణ్ చందా మండలం తహసీల్దార్ కి గత నెల రోజులు గడిచిపోయిన వాటిపై ఏం చర్యలు తీసుకున్నారు వివరాలు ఇవ్వకుండా మభ్యపెడుతూ ఎందుకు ముందుకు రావడం లేదు ఇలాంటి ఇసుక డంపులు మరిన్ని ఉన్నవో ఎవరికీ తెలియదు రాయల్టీ సుంకం వసూలు చేయకుండా బుక్ మైంటైన్ చేయకుండా ఇష్టారాజ్యంగా ఇసుకను తోడుకు వెళుతున్న వారిపై చర్యలు తీసుకోకపోగా పత్రికలో రాసిన పాత్రికేయునిపై కేసు పెడతానని ఫోను చేసి భయభ్రాంతులకు గురి చేయడం ఎంత వరకు సబబు
ముఖ్యంగా ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా మీరు ఉన్నట్లయితే ఇన్ని రోజులైనా మేము చూపించిన ఇసుకపై ఇసుక డప్పులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు చర్యలు తీసుకున్న వాటి వివరాలు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నిస్తున్నారు మీరు మండల తహసిల్దారుగా చేపట్టినటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నవి, అడిగిన ప్రశ్నలకు సరైన జవాబు ఎందుకు ఇవ్వడం లేదు ఎవరి కొరకు మీరు ఈ పనిచేస్తున్నరు, ఈ పనితీరును ఏమని అర్థం చేసుకోవాలో తెలియడం లేదు తహసిల్దార్ గా మీరు టెండర్ వేశామని టెండర్ లో ఎంత మంది పాల్గొన్నారు ఆ వివరాలు ఇప్పటివరకు మీరు వెల్లడించడం లేదు ఫోన్లో సంప్రదించగా ఫోను కూడా తీయడం లేదు మేము ఏమి అర్థం చేసుకోవాలి ఇదే కాదు చాలాసార్లు మండలంలోని డీటీ గారికి నేషనల్ హైవే 61 కనుక పూర్ లో గల బ్రిడ్జి కింది నుండి ఆధునిక యంత్రాలతో ఇసుకను తోడుతుంటే రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుంది దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు బ్రిడ్జి కింద నుండి ఇసుకను చూడడం వలన బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉంది కోట్ల రూపాయలు హెచ్చించి రహదారి సౌకర్యాల కోసం కట్టిన బ్రిడ్జి కింద నుండి ఇసుక తోడడం వీరమని తెలిసినా ఇసుక మాఫియా వారు రోజు రోజుకు రెచ్చిపోయి ఇసుకను తోడుతున్నారు అయినా మన రెవెన్యూ సిబ్బందికి ఇది పట్టదు ఎందుకు మీరేం చేస్తున్నారు మీకు పదవి అనగా ఉద్యోగ రీత్యా రెవెన్యూ వారు విధి నిర్వహణ బాధ్యతలు మరిచి వారు చేస్తున్న తీరు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆధునీక యంత్రాలతో ఇసుకను తీస్తున్న ఆపేవారు లేర ఇవన్నీ సిబ్బంది కి వారెవరో తెలియద, లక్ష్మణ్ చందా మండలంలో నీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు
వెంటనే 24 గంటలు రెస్క్యూటింగా ఏర్పడి ఇసుక మాఫియా వారిపై తగిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని ప్రశ్నిస్తున్నారు మీరు వెంటనే దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ చందా మండల్ లో గల గ్రామాలలో ఎక్కడైనా ఇసుక
డంపులు ఉన్నా వాటిపై తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రజల సొమ్మును ప్రజలకు దక్కాల్సిన రాబడిని మీరు ఎందుకు కాపాడలేకపోతున్నారు అందుకని మిమ్మల్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.