నారద వర్తమాన సమాచారం
నరసరావుపేట 1వ పట్టణ పరిధిలో బహిరంగ మద్యం సేవనం పై, మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై మరియు త్రిబుల్ రైడింగ్ పై పోలీసుల ప్రత్యేక దాడులు
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు
ప్రజల భద్రతను పెంపొందించేందుకు మరియు చట్టాలను అమలు చేయడంలో భాగంగా నరసరావుపేట 1 వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ పార్టీ పోలీసు లతో బహిరంగ మద్యం సేవనం, మద్యం మత్తులో వాహనాల నడపటం మరియు త్రిబుల్ రైడింగ్ పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబడింది.
ఈ తనిఖీల లో భాగంగా బహిరంగంగా మద్యం సేవిస్తూ పట్టుబడిన పలువురిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయబడ్డాయి.
అదే విధంగా మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు
తీసుకోబడినట్లు ఎందుకంటే మద్యం మత్తులో డ్రైవింగ్ ప్రజల ప్రాణాలకు పెద్ద పెద్ద ప్రమాదాన్ని కలిగించగలదని సీఐ MV చరణ్ తెలిపారు.
అదనంగా త్రిబుల్ రైడింగ్ చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేయబడినట్లు, ఇది ప్రమాదకరమైన ఉల్లంఘనగా పరిగణించబడుతుంది అని తెలిపారు.
ప్రమాదాల అవకాశాలను పెంచి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుంది అని తెలిపారు.
నరసరావుపేట 1 టౌన్ పోలీసులు ప్రజలు చట్టాలను కచ్చితంగా పాటించాలని, బహిరంగ మద్యం సేవనం, మద్యం మత్తులో డ్రైవింగ్ మరియు త్రిబుల్ రైడింగ్ కు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రజల భద్రతకు కట్టుబడి ఉంటామని పోలీస్ విభాగం స్పష్టం చేస్తోంది.
బహిరంగ ప్రదేశాల్లో మధ్యం సేవించి వారిపై సమాచారం నరసరావుపేట 1 టౌన్ పోలీసులకు తెలియజేయాలని తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.