నారద వర్తమాన సమాచారం
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వ్యక్తికి నెల రోజులు జైలు శిక్ష విధించిన కోర్టు
ఆంధ్రప్రదేశ్ డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఈ నెల ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా పల్నాడు జిల్లా నరసరావుపేట నందు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది.
ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి. శ్రీనివాసరావు ఐపిఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా
నరసరావుపేట రెండవ పట్టణ సిఐ
M.హైమారావు తన సిబ్బందితో కలిసి వాహనములు తనిఖీ చేయుచుండగా షేక్ హసన్ బుడే తండ్రి బూరే సాహెబ్,44 సం,కులం: ముస్లిం, జానపాడు గ్రామం, పిడుగురాళ్ల మండలం అను వ్యక్తి మద్యం తాగి వాహనం నడుపుతుండగా అతనిని అదుపులోనికి తీసుకుని నరసరావుపేట స్పెషల్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ కోర్టు 1st AJCJ ఇన్చార్జ్ కోర్ట్ నందు ముద్దాయి హాజరు పరచగా జడ్జి అయిన A. సలోమి అతనికి నెల రోజులు జైలు శిక్ష విధించారు.
కావున వాహనములు నడిపేవారు మద్యం తాగి నడపవద్దని హెచ్చరించడమైనది మరియు తగిన డాక్యుమెంట్స్ దగ్గర ఉంచుకోవాలని, హెల్మెట్ ధరించవలసినదిగా తెలపడం అయినది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.